ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకొని క్షేత్రంలోని ఆలయాలు మూసివేసినట్లు అర్చకులు తెలిపారు. ఆదివారం ఉదయం అభిషేకాలు, నిత్య పూజల అనంతరం గుడి తలుపులు మూసివేసినట్లు పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గమనించాలన్నారు. తిరిగి సోమవారం ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.