ప్రకాశం జిల్లా తాళ్లూరు ఎమ్మార్వో కార్యాలయం నందు రేషన్ డీలర్ తో డిప్యూటీఎమ్ఆర్ఓ పణి సమావేశం నిర్వహించారు. వికలాంగులకు పెద్ద వయసు గల వారికి ఇంటి వద్దకే రేషన్ సరుకులు సరఫరా చేయాలని డీలర్లను ఆదేశించారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి రేషన్ పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో వీఆర్వోలు డీలర్లు తదితరులు పాల్గొన్నారు.