చెత్త తరలింపు ప్రక్రియ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి నారాయణ.ఇప్పటికే 60శాతంకి పైగా చెత్త తీసేసామన్నారు.వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి 85లక్షల టన్నుల చెత్త పెట్టి పోయారన్నారు.అనంతపురం నగరంలోని డింపింగ్ యార్డును సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పరిశీలించారు. అక్టోబర్ -2 నాటికి ఇక్కడ చెత్త లేకుండా పూర్తి చేస్తామన్నారు. డంపింగ్ యార్డు స్థానంలో ఒక అద్భుతమైన పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు.అమృత్, స్వచ్చభారత్ పథకాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.కేంద్రం ఇచ్చిన నిధులను సరిగా వినియోగించుకో లేకపోయారన్నారు.