పిఠాపురం నియోజకవర్గంలోని మత్స్యకారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే వర్మ గురువారం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్లో అధికారులను కలిశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్యకారులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అయితే యు కొత్తపల్లిలోని మత్స్యకారులకు అనేక సమస్యలు ఉన్నాయని వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరారు.