మోరంపూడి ప్రైవేటు స్కూల్ హాస్టల్ లో విద్యార్థి విన్సెంట్ ప్రసాద్ (16) పై ఉద్దేశపూర్వకం గానే దాడి చేశారని దళిత చైతన్య వేదిక ఆరోపించింది. రాజోలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని నేతలు పరామర్శించారు. దాడికి పాల్పడిన విద్యార్థులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ర్యాగింగ్ కాదని కావాలనే ఇస్త్రీ పెట్టెతో కాల్చారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు.