అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి పట్టణంలోని సాయిబాబా ఆలయం వద్ద నల్లారి వారి ఆశీస్సులతో ఆడిటర్ సిబ్బాల దినకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం భారీ వినాయక విగ్రహాల వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలికిరి మండల సింగిల్ విండో చైర్మన్ నల్లారి చంద్రకుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ నల్లారి లక్ష్మీకర్ రెడ్డి, సిఐ అనిల్ కుమార్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాలతి హాజరై విగ్రహాలను పంపిణీ చేశారు.ఆడిటర్ సిబ్బాల దినకర్ మాట్లాడుతూ నల్లారి కుటుంబం ఆశీస్సులతో 5లక్షలు విలువచేసే 15వినాయక విగ్రహాలను గ్రామ ప్రజలకు వితరణ చేయడం సంతోషంగా ఉందని అన్నారు