కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బల్వంత్ రావు మాట్లాడుతూ.. ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. రైతుల శ్రేయస్సు కొరకు బిఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులను నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.