పల్నాడు జిల్లా,నకరికల్లులో జనసేన కార్యకర్త వెంకటేష్ పై ప్రత్యర్థులు దాడి చేశారు.వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్న క్రమంలో బైకుపై వెళుతున్న వెంకటేష్ పై దాడి చేయడంతో తీవ్ర గాయాలైయ్యాయి.బడితుడిని స్థానికులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.తనపై వైసీపీ కార్యకర్తలు నలుగురు కలిసి దాడి చేశారని బాధితుడు ఆరోపించారు.నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు వెంకటేష్ ని శనివారం జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు,పలువురు జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు.