అన్నదాత పోరుబాట విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొండపి వైసిపి ఇన్ ఛార్జ్ ఆదిమూలపు సురేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారని అందులో భాగంగా సెప్టెంబర్ 9 మంగళవారం కొండపి పట్టణంలో నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు ఆదిముల సురేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా అందించలేకపోతుందని విమర్శలు పించారు. రేపు జరగబోయే నిరసన ర్యాలీకి ప్రజలు మరియు కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావాలన్నారు. సంబంధిత అధికారులకు యూరియా రైతులకు అందించాలని వినతిపత్రం సమర్పిస్తామని మాజీ మంత్రి అన్నారు.