మంత్రాలయం: శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ 200 గదుల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య రోజురోజుకు అధికమవుతుండటంతో గదుల సమస్యలు అధికంగా ఉంది. దీంతో భక్తుల సౌకర్యార్థం ఈ గదులు నిర్మిస్తున్నట్లు స్వామీజీ తెలిపారు.కర్నూలుకు చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డికి నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు.