నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, రాజకీయాలకు కతీతంగా అభివృద్ధి చేయాల్సిన ప్రజాప్రతినిధులే పనులకు అడ్డంకిగా మారారని ఆటంకంగా మారుతున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో నిరాహార దీక్షకు దిగుతామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు హెచ్చరించారు. శనివారం ప్రజా సమస్యల పరిష్కరించాలని కోరుతూ జూపాడు బంగ్లా సర్వసభ్య సమావేశం జరుగుతున్న ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించి సీపీఐ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టారు, అధికారులు హామీ జుపాడు బంగ్లా మండల ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, తక్షణమే సి