కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయంలో చైర్ పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు రంగప్ప చెరువు పారిశుద్ధ్యం, సిసి రోడ్ల నాణ్యత, వీధిలైట్లపై అధికారులను నిలదీశారు. రంగప్ప చెరువులో గుర్రపుడెక్కను తొలగించాలని, వీధిలైట్లు వేస్తామని గత సమావేశాల్లో చెప్పినా నేటికీ ఆ ఊసే లేదని కౌన్సిలర్లు గంట అప్పలస్వామి, గుళ్ళ సుబ్బారావు, మైనం భవాని, మొగలి దొరబాబు తెలిపారు.