మంత్రి సవిత పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నియోజకవర్గానికి చెందిన 52 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.26,53,615ల చెక్కులను అందజేశారు. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, పరిశీలకుడు నరసింహారావు, మార్కెఫెడ్ ఛైర్మన్ బంగార్రాజు ఉన్నారు.