సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ నాయకులు ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. సీబీఐ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని కేటీఆర్ పిలుపుమేరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రధాన రహదారి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగించారు. పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించి కుట్రలపై మండిపడ్డారు. రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.