ఇదేంటి పోలీస్ స్టేషన్ లో శివునికి పూజలేంటని అనుకుంటున్నారా... అవును ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రతి మహా శివరాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్టేషన్ నిర్మించేటప్పుడు తవ్వకాల్లో ఆ ప్రాంతంలో శివుడి విగ్రహం ప్రత్యక్షమైందని, అప్పటి నుండి పోలీస్ స్టేషన్ లోనే చిన్న గుడి కట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పోలీసులు తెలిపారు. ఇక మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని పోలీస్ స్టేషన్ లో వెలసిన శివలింగానికి స్టేషన్ సిబ్బంది బుధవారం ప్రత్యేక పూజలు చేశారు.