Araku Valley, Alluri Sitharama Raju | Aug 22, 2025
జీకే వీధి మండలం సీలేరు భక్తుల కొంగు బంగారం మారెమ్మ తల్లి ని భక్తులు పలు కాయగూరలతో అలంకరించారు.తెల్లవారు జామునే అమ్మవారికి అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం భక్తులతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈకారక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.అమ్మవారి దేవాలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా గుడి కమిటీ తగు ఏర్పాట్లు చేశారు.