జగిత్యాల జిల్లా కేంద్రంలో బీసీ వసతి గృహ గ్రేడ్ 1 సంక్షేమ అధికారిగా మల్యాల వెంకటరెడ్డి ఆగస్టు 31న ఉద్యోగ విరమణ పొందారు.ఈ సందర్భంలో తన కాలికి గాయం కావడంతో ఉద్యోగ విరమణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన డాక్టర్ సంజయ్ కుమార్ వెంకటరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటరెడ్డికి శాలువా కప్పి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ ఉద్యోగ విరమణ అనంతరం కూడా సామాజిక సేవ పట్ల దృష్టి సారించాలని సూచించారు 39 సంవత్సరాల సుదీర్ఘంగా వసతి గృహ సంక్షేమ అధికారిగా అన్ని వర్గాల మన్ననలతో విధులు....