ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలం పెద్ద చల్మెడ గ్రామానికి చెందిన వీరయ్య రెండు కిలోల ఎండు గంజాయితో పట్టుబడ్డారు.నేరం రుజువు కావడంతో జైలు శిక్షతో పాటు 25 వేల జరిమానా విధించినట్లు గురువారం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు ఎక్సైజ్ సీఐ నజీర్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అక్రమంగా గంజాయి తరలిస్తే జైలు జీవితం తప్పదు అన్నారు.