అనంతపురంలో ఈ నెల 10న జరుగునున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో హెలీప్యాడ్ స్థలాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం పరిశీలించారు. హేలీ ప్యాడ్ ఏర్పాట్లను పక్కాగా చేయాలని స్థానిక అధికారులను మంత్రులు ఆదేశించారు.