ఒంగోలు నగరంలో వినాయక నిమజ్జనం నేపథ్యంలో పోలీసులపై దాడి చేసిన ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను ఒంగోలు తాలూకా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు వారికి రిమాండ్ విధించగా జిల్లా జైలుకు పంపారు. ఒంగోలు 45వ డివిజన్ మారుతీ నగర్ కు చెందిన వినాయక నిమజ్జన సమయంలో డీజే ఆపాలని చెప్పిన ట్రాఫిక్ ఎస్ఐ కానిస్టేబుల్ పై పెద్ద సంఖ్యలో వైసిపి కార్యకర్తలు దాడి చేశారు ఈ దాడిలో 20 మంది మహిళలు సహా వంద మంది పాల్గొన్నట్లుగా సిసి ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు వారిలో ప్రధానంగా పోలీసులపై దాడి చేసిన ఆరుగురిని కోర్టు ద్వారా జైలుకు పంపారు