అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని మైలవరం మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం తెలిసిన వివరాల మేరకు మైలవరం మండలంలోని అనంతరాయుని పేట గ్రామానికి చెందిన రైతు సిద్ధం రెడ్డి సంజీవరెడ్డి 10 ఎకరాల పొలంలో మిరప, పత్తి పంటలు సాగు చేశారు. తెగుళ్లు,ఇతర కారణాలతో దిగుబడి సక్రమంగా రాలేదు. ఇందుకు దాదాపు 15 లక్షల పైగా అప్పులు చేశారు. అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై శనివారం విషద్రావణం తాగాడు. కుటుంబ సభ్యులు గుర్తించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.