పిచ్చాటూరులో త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం పిచ్చాటూరు టీచర్స్ కాలనీలో విద్యుత్ శాఖ అధికారులు నూతనంగా 24 గంటల త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం ఉదయం పూజలు చేసి దీనిని ప్రారంభించారు. ప్రజలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి గ్రామంలో కొత్త లైన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.