ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయానికి హుండీల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. గడచిన 31రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.18 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని అత్యంత భద్రతాఏర్పాట్ల మధ్య నిర్వహించగా 2కోట్ల18లక్షల84వేల539 రూపాయల నగదు అలాగే భక్తుల కానుకలు రూపేణా 120 గ్రాముల బంగారం, 4కేజీల79 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఈవో సత్యనారాయణ మూర్తి తెలిపారు.