కోవూరు మండలం పడుగుపాడు చంద్రమౌళి నగర్ పంట కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయింది.సమాచారం అందుకున్న ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతి చెందిన వ్యక్తి చేతిపై జగన్మోహన్ అని పేరు ఉన్నట్లు, స్థానికంగా చెత్త కాగితాలు ఏరుకునే వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.