అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జిల్లాలోని గోనబావి గ్రామానికి చెందిన తిమ్మప్ప అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.