యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ఈనెల 9న భువనగిరిలోని దివ్య ఫంక్షన్ హాల్ లో జరుగుతున్నాయని ప్రజా సదస్సును జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఇక్బాల్ శనివారం అన్నారు .ఈ సందర్భంగా ఆలేరు పట్టణంలోని తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ప్రజా సమితి కరపత్రాన్ని ఆవిష్కరణ చేపట్టారు .ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మల్లేశం అశోక్ అంజయ్య ఖలీల్ మదిన్ తదితరులు పాల్గొన్నారు.