ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా పెద్దన్న అనే వ్యక్తి తనకు రావలసిన నగదు ఇప్పించాలని భార్యాభర్తలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయవరం గ్రామంలోని వారిలో 2002 కుటుంబ సభ్యులతో కలిసి పని చేసినట్లు తెలిపారు. కానీ క్వారీ యజమాని తనకు రావలసిన రెండు లక్షల 52,000 ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కోర్టు కూడా తనకు అనుకూలంగా తీర్పునిచ్చిందని ఆ తీర్పు మేరకు నాకు రావలసిన నగదును ఇప్పించాలని సబ్ కలెక్టర్ ను కోరారు.