నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని పలు ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలలో సానిటేషన్ డ్రైవ్ ను నిర్వహించారు. నల్గొండ మున్సిపల్ సహాయ కమిషనర్ రవీందర్ రెడ్డి రామనగర్ మున్సిపల్ పార్కులో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను పరివేక్షించారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా నల్లగొండ పట్టణంలోని శానిటేషన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.