గూడాటిపల్లి గ్రామంలో తప్పుల తడకగా ఓటర్ లిస్ట్... దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా పై ప్రకంపనులు చేలరేగుతున్నాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గూడాటిపల్లిలో ఓటర్ లిస్ట్ తప్పులతడకగా ఉందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. నూతన గ్రామపంచాయతీగా ఏర్పడ్డ గ్రామంలో 4వార్డులు ఉండగా ఒకే కుటుంబ సభ్యులను వేరువేరు వార్డుల్లో ఓటర్లుగా పొందుపరిచారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సవరించుకోవడానికి గడువు తక్కువగా ఉన్నప్పటికీ అధికారులు వారి గ్రామంలో ఓటర్ లిస్టు బహిరంగంగా ప్రదర్శించకపోవడంతో గ్రామస్థులు అయోమయంలో పడ్డారు.