బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామంలో కోల్ ఇండియా వారి సౌజన్యంతో సీఎస్ఆర్ నిధులు రూ. 12. 63 లక్షల విలువగల 0.5 ఎంఎఓడి మైక్రో ఫిల్టర్ ప్రారంభోత్సవం జరిగింది. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.