భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 2గంటలకు కలెక్టరేట్ వద్ద పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫీజు దీక్ష శిబిరాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా 8158 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి నేడు ఉంది అని వారు అన్నారు.