ఆలూరు నియోజకవర్గం లోని ఎమ్మెల్యే విరుపాక్షి బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని కలవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు లేనిపోని అక్రమ కేసులు ఎంపీ మిథున్ రెడ్డి పై పెట్టారన్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డిని ఎదుర్కోలేక సాక్షాత్తు సీఎం ఎంపీ మిథున్ రెడ్డి పై కేసులు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.