నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని దళితులకే ఇవ్వాలి అంటూ గోస్పాడు మండల రెవెన్యూ ఆఫీస్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర దళితులు ఏకమై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నందికొట్కూరు నియోజకవర్గం డాక్టర్ కాకరవాడ, చిన్న వెంకటస్వామి కి నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని ముకుమ్మడిగా వారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకే