Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: కాంటాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి: సిఐటియు జిల్లా కార్యదర్శి బి.బలరాం

Narayanpet, Narayanpet | Aug 31, 2025
పెండింగ్ లో ఉన్న కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల 8 నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరాం ఆదివారం 4 గంటల సమయంలో ఒక ప్రకటనలో కోరారు. ఉపాధి సొసైటీ కింద పనిచేస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్లు కంప్యూటర్ ఆపరేటర్లు ప్రభుత్వ వసతి గృహాల్లో పనిచేస్తున్న స్లీపింగ్ ఫుడ్ వర్కర్ కార్మికుల వేతనాలు నేటికీ 8 నెలలు గడుస్తున్నా ఇవ్వడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో వృద్ధాశ్రమము బాలల కేంద్రం, సఖి కేంద్రాల్లో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులకు 7 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us