నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాంట్రాక్ట్ కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు కేబుల్ కిషన్ భవన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు కాంట్రాక్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాలిక్ మాట్లాడుతూ, పరిశ్రమలు కార్మికులచే వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయని ఆరోపించారు. అనంతరం కార్మికులు కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు