రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనంతపురం జిల్లా నూతన కలెక్టర్గా ఓ ఆనంద్ కుమార్ కు బాధ్యతలను అప్పగించిన నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం అనంతపురం నగరానికి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, డిఆర్ఓ మలోల, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆయనను కలిసి ఘన స్వాగతం పలికారు.