నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి నిర్వహించిన వినాయక శోభాయాత్రను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులతో నిర్మల్ కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా పాత బస్టాండ్ వద్ద ఉన్న చింతకుంట వాడ (8వ నంబర్) వినాయకుడిని చూసేందుకు వేలాది మంది ఆసక్తి చూపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ జానకి షర్మిల స్వయంగా పర్యవేక్షించి బందోబస్తును పటిష్టం చేశారు.