నరసన్నపేట: భక్తిశ్రద్ధలతో శ్రీ బిడారమ్మ దేవత ప్రతిష్ఠ నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక కలివరపుపేట వద్ద ఉన్న కామేశ్వరి నగర్‌లో శ్రీ బిడారమ్మ దేవత ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలను చేపట్టారు. వేద పండితులు భాస్కరభట్ల జగదీశ్వర శర్మ మాట్లాడుతూ.. ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి హోమాది కార్యక్రమాలు చేపట్టామన్నారు.