పేద ప్రజలకు, గర్భవతులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు సేవలందిస్తున్న ఆశ వర్కర్స్ను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి. ఏసురత్నం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం డోన్లోని సీఐటీయూ కార్యాలయంలో ఆశా వర్కర్స్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు.