నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. జాదవ్ దినేశ్ కుటుంబం ఆదివారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళంతో పాటు బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎంత విలువైన ఆస్తి నష్టం జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది