సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మొగుడంపల్లి రహదారిలో కల్వర్టు కుంగిపోయి ప్రమాదకరంగా మారింది. జహీరాబాద్ మండలంలోని హోతి బి - గోవింద్పూర్ గ్రామాల మధ్య రహదారిపై గల కల్వర్టు కుంగిపోయి కిందికి దిగడంతో కూలిపోయే ప్రమాదం నెలకొంది. భారీ వాహనాలు వెళితే మరింత బీటలు వారుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారి కావడంతో అధికారులు ప్రమాదం చోటు చేసుకోక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.