సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పట్టణంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. విద్యా సంవత్సరం సమీపిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు, బోధనా రుసుములు చెల్లించడం లేదని విద్యార్థి నాయకులు ఆరోపించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించడంతో ప్రధాన రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు చెరుకుని విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.