అంగన్వాడీలకు ఎఫ్ఆర్ఎస్ యాప్ ను రద్దు చేయాలని వేతనాలు పెంచాలని గ్రాట్యూట్ ఇవ్వాలని గురువారం అంగన్వాడీల అఖిలభారత కమిటీ సిఐటియు పిలుపు మేరకు గురువారం సాయంత్రం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించారు సందర్భంగా రాస్తారో ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి నగర కార్యదర్శి నాగరాజమ్మ అధ్యక్షురాలు జయప్రభ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2014వ సంవత్సరం నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెంచడం లేదని అన్నారు మన రాష్ట్రంలో 2019 నుంచి వేతనాలు పెంచలేదని వేతనాలు పెంచకపోగా ఈ కాలంలో పని భారం విపరీతంగా పెరిగిందని చెప్పారు.