తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గం ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఎవరు కూడా వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ఎలాంటి అవాంఛనీయ సంఘాటనలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.