వికారాబాద్ జిల్లాలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణ కోసం మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ రూపొందించిన ఆన్లైన్ పోర్టల్ లో వివరాలను నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. ఆన్లైన్ నమోదు భద్రత బందోబస్తు ఏర్పాట్ల కోసం మాత్రమేనని ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి మండపం సమాచారం అందుబాటులో ఉంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలకు అవకాశం ఉంటుందని తెలిపారు.