వాంకిడి మండలం సరండి గ్రామంలో ఈ నెల 23న భవాని జాతర జరుగనున్న నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రహదారి మరమ్మత్తు పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. పొలాల అమావాస్య సందర్భంగా జరుగనున్న జాతరకు వేలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, రవాణాకు ఇబ్బందులు కలుగకుండా రహదారి మరమ్మత్తు కొరకు అందిన ప్రతిపాదనల మేరకు 60 వేల రూపాయలు మంజూరు చేసి పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా 1 కిలోమీటర్ మేర దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేయడం జరిగిందని తెలిపారు.