కంచిలి మండలం మాణిక్యపురం రైతు సేవ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సందర్శించారు. వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక రైతులతో మాట్లాడారు. సాగులో ఎరువుల వినియోగం తగ్గించుకోవాలన్నారు. వ్యవసాయ సంబంధిత వివరాల విషయంలో రైతులు చెప్పిన వివరాలు అధికారులు చెప్పిన వివరాల్లో తేడాలు ఉండటంపై అధికారులను ప్రశ్నించారు. సరైన సమాచారం లేకుండా ఎలా సేవలు అందిస్తున్నారు అంటూ ఆగ్రహించారు.