ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఇటీవల జనసేన క్రియాశీలక సభ్యులు గురునాథం మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున ఐదు లక్షల చెక్కును అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్ చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.