శ్రీకాళహస్తిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం శ్రీకాళహస్తిలోని SSB మున్సిపల్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఉపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలన చేసి గిడుగు వెంకట రామ్మూర్తి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు తెలుగు తల్లితోపాటు కవులు నన్నయ్య, ఎర్రన్న, తిక్కన్న గురించి వారు వివరించారు. మాతృభాషా తల్లి ఒడి నుంచే ప్రారంభమవుతుందని వారు కొనియాడారు.