ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు సంఖ్య 90 శాతం పెంచాలని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ మంగళవారం మంగళవారం సాయంత్రం 5-30 గంటల ప్రాంతంలో మాతా శిశు కేంద్రం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు ఎక్కువ పెంచాలనీ, గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాలు పెంచాలన్నారు. డాక్టర్లు సమయపాలన పాటించాలనీ... వైద్యం కొరకు వచ్చిన పేషెంట్లను ఆత్మీయతంగా పలకరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్,ఎం సి హెచ్ సూపర్డెంట్,ఆర్ ఎం ఓ లు తదితరులు పాల్గొన్నారు.